సంబేపల్లి మండలం రైతుకుంటలో శుక్రవారం ఉదయం విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తుండగా, బత్తిన మనోహర్ అనే ప్రైవేటు కూలి విద్యుదాఘాతంతో స్తంభంపైనే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, విద్యుత్ శాఖ డీఈ లివింగ్టన్ అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆదేశాల మేరకు మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.