రామాపురం: టెంకాయ చెట్టుపై పడ్డ పిడుగు.. తప్పిన ప్రాణాపాయం

1352చూసినవారు
రామాపురం మండలం చిట్లూరు మాలపల్లిలో మంగళవారం సాయంత్రం కురిసిన గాలివానకు భారీ పిడుగుపాటు సంభవించింది. గ్రామానికి చెందిన చంద్రయ్య ఇంటి వద్ద ఉన్న టెంకాయ చెట్టుపై ఉరుములు, మెరుపులతో కూడిన పెద్ద పిడుగు పడటంతో ఆ చెట్టు పూర్తిగా కాలిపోయింది. పిడుగు పడినప్పుడు వచ్చిన పెద్ద శబ్దంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో చెట్టు దగ్గర ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సంబంధిత పోస్ట్