సీప్ స్వర్ణోత్సవాల్లో రాయచోటి పూర్వ విద్యార్థులు

393చూసినవారు
సీప్ స్వర్ణోత్సవాల్లో రాయచోటి పూర్వ విద్యార్థులు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏసియన్ అండ్ పసిఫిక్ స్టడీస్ (సీప్) స్వర్ణోత్సవ వేడుకలలో రాయచోటికి చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈనెల 6 నుంచి 8 వరకు జరిగిన అంతర్జాతీయ సెమినార్ చివరి రోజున డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి, మోటకట్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజ హాజరయ్యారు. 1991–1993 బ్యాచ్ పూర్వ విద్యార్థులుగా సెంటర్‌తో తమకున్న అనుబంధాలను వారు గుర్తుచేసుకున్నారు. సీప్ విభాగం అంచలంచలుగా అభివృద్ధి చెందుతూ దేశంలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్