రాయచోటి: రాయుడు కాలనీలో అవగాహన కార్యక్రమం

723చూసినవారు
శనివారం సాయంత్రం రాయచోటి అర్బన్ CI బి. వి. చలపతి, SI విష్ణువర్ధన్ స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో రాయుడు కాలనీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణ, రోడ్డు భద్రతా నియమాలు, బాల్య వివాహాల నిర్మూలన, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. అపరిచిత కాల్స్, మెసేజ్‌లు, ఆన్‌లైన్ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మహిళల భద్రత సమస్యలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్