రాయచోటి: 31 నుంచి చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు

133చూసినవారు
రాయచోటి: 31 నుంచి చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు
రాయచోటి పట్టణంలోని స్థానిక చౌడేశ్వరి కాలనీలో ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 2 వరకు జ్యోతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు శనివారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 31న గణపతి పూజ, పంచామృతాభిషేకం, సాయంత్రం సహస్రనామార్చన ఉంటాయి. ఏప్రిల్ 1న 108 బిందెలతో అభిషేకం, 2న కలశమార్జనం, చండీ హోమం, మహా మంగళహారతితో పాటు రాత్రి అగ్నిగుండ ప్రవేశం, అమ్మవారి పుష్పపల్లకి ఊరేగింపు జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్