రాయచోటి: ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు పరిస్థితి విషమం

1026చూసినవారు
ఆర్టీసీ బస్సు ఢీకొని ట్రాక్టర్ బోల్తా పడి రైతు పరిస్థితి విషమించినట్లు వాల్మీకిపురం ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మండలంలోని చింతపర్తి వారిపల్లెకు చెందిన రైతు నాగరాజు, ట్రాక్టర్ ను వాల్మీకిపురానికి మంగళవారం తీసుకువచ్చి తిరిగి వెళుతుండగా, పునుగుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను ఢీకొనడంతో బోల్తా పడి రైతు తీవ్రంగా గాయపడగా..  మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించిగా పరిస్థితి విషమించడంతో అతన్ని తిరుపతికి తరలించారు.

సంబంధిత పోస్ట్