అన్నమయ్య జిల్లా రాయచోటి మదనపల్లి రింగ్ రోడ్‌లో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఝాన్సీ రాణి (41) మరియు దీత్య (15) అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని 108 అంబులెన్స్ ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు.