అన్నమయ్య జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతను లక్ష్యంగా చేసుకుని, జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు శుక్రవారం 'శక్తి' బృందాలు, పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ వినియోగం, పోక్సో చట్టం గురించి ప్రజలకు వివరించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై చైతన్యపరిచారు. బాల్య వివాహాలు సామాజిక నేరమని, అలాంటి ఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మత్తుకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.