విజయవాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో రాయచోటి 4వ వార్డు వైసీపీ కౌన్సిలర్ కొలిమి హారూన్ భాషా, పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ వైఫల్య పాలనతో విసిగిపోయి, సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విశ్వాసంతో టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. మంత్రి వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.