రాయచోటి ప్రభుత్వ కళాశాలలో ఆర్జేడీ డా. కె. జ్ఞానేశ్వర్ ఆకస్మిక తనిఖీ

1444చూసినవారు
రాయచోటి ప్రభుత్వ కళాశాలలో ఆర్జేడీ డా. కె. జ్ఞానేశ్వర్ ఆకస్మిక తనిఖీ
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం కడప ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు (RJD) డా. కె. జ్ఞానేశ్వర్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రిన్సిపాల్ డా. ఎస్. స్మిత ఆహ్వానం మేరకు కళాశాలలోని అన్ని విభాగాలను పరిశీలించి, బోధన విధానాలు, విద్యార్థుల హాజరు, ఫలితాల మెరుగుదలపై అధ్యాపకులకు సూచనలు చేశారు. విద్యార్థులు ఆధునిక నైపుణ్యాలను అలవరచుకోవాలని, అధ్యాపకులు నాణ్యమైన బోధనపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన చర్యలపై ప్రిన్సిపాల్‌తో చర్చించారు.

సంబంధిత పోస్ట్