రామాపురంలో రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి

1950చూసినవారు
రామాపురంలో రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి
రామాపురం మండలం ఏకిలపల్లి బస్టాప్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న రామాపురం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు రామాపురం ఎస్‌ఐను 9121100558 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్