రాయచోటి మండలం సిబ్యాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. స్కూటర్‌పై వెళ్తున్న మల్లికార్జున (25) రహదారి దాటుతున్న శ్రీనివాసులు (55)ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శ్రీనివాసులు తీవ్రంగా గాయపడగా, మల్లికార్జున, అతని తల్లి స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన శ్రీనివాసులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రాయచోటి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.