చిన్నమండెం మండలం కేసాపురం వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారును గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లి మండలం సీటీఎంకు చెందిన శివకుమార్ (30), చిన్నబాబు, మనోహర్‌తో పాటు మరో ఇద్దరు రాయచోటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.