గాలివీడు మండలం ధనంరెడ్డిగారిపల్లికి చెందిన
వైసీపీ ముఖ్య నేతలు బసిరెడ్డి, కృష్ణారెడ్డి, శివారెడ్డి బుధవారం టీడీపీలో చేరారు. రాయచోటి నియోజకవర్గ
టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమ పథకాలే పార్టీ ఆదరణకు కారణమని, రానున్న రోజుల్లో గాలివీడు మండలంలో
టీడీపీ మరింత బలోపేతం కానుందని ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.