రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం పొత్తపి గ్రామంలో శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములో శుక్రవారం మధ్య అష్టమి ఆరుద్ర నక్షత్రం మహాలయ పక్షం మూడింటి కలయిక సందర్భముగా శ్రీ స్వామి వారికి అర్చకులు శ్రీ షహపురం గోపీనాథ్ ఆధ్వర్యంలో అభిషేకం మరియు ప్రత్యేక పూజలు జరిగాయి. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించారు.