రాయచోటిలో డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా – ట్రాఫిక్ నియంత్రణ

42చూసినవారు
అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రాయచోటి టౌన్ CI బి. వి. చలపతి శనివారం డ్రోన్ కెమెరా ద్వారా ప్రత్యేక నిఘా చేపట్టి అసాంఘిక చర్యలపై పర్యవేక్షణ నిర్వహించారు. బస్టాండ్ సర్కిల్ నుండి బంగ్లా సర్కిల్, శివాలయం ప్రాంతాల వరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల్లో అస్తవ్యస్తంగా నిలిపిన వాహనాలను క్రమబద్ధీకరించడం, ప్రజలకు ట్రాఫిక్ అవగాహన కల్పించడం, వ్యాపారులకు రహదారులు ఆక్రమించరాదని హెచ్చరికలు చేయడం ఈ కార్యక్రమంలో భాగంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్