మంగళవారం రాత్రి రామాపురం మండలం సరస్వతిపల్లి హరిజనవాడలో వీధి కుక్కలు పిల్లిండ్ల ఆంజనేయులు కుటుంబానికి చెందిన గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో 40 గొర్రెలు మృతి చెందాయి. ఈ దాడి వల్ల సుమారు రూ. 4–5 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.