లక్కిరెడ్డిపల్లిలోని చౌడమ్మ గుడిలో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ పగిలి ఉండటాన్ని గమనించి ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. హుండీని పగలగొట్టి అందులోని నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.