రాయచోటిలో ట్రాఫిక్ తనిఖీలు.. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

1372చూసినవారు
రాయచోటిలో ట్రాఫిక్ తనిఖీలు.. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
రాయచోటి పట్టణంలోని ఎస్‌ఆర్ కళ్యాణమండపం రింగ్‌రోడ్ వద్ద ఆదివారం ట్రాఫిక్ సీఐ శేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన, రికార్డులు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ శేఖర్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్