లక్కీరెడ్డిపల్లి మండలం కోనంపేట గ్రామంలో ఎలుగోటి రామకృష్ణ (55) అనే ఉపాధ్యాయుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల వ్యవసాయం చేస్తున్న రామకృష్ణ, గురువారం ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. భార్య గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.