రాయలసీమ ప్రాజెక్టుల కమిటీలో విజయభాస్కర్‌కు బాధ్యతలు

2454చూసినవారు
రాయలసీమ ప్రాజెక్టుల కమిటీలో విజయభాస్కర్‌కు బాధ్యతలు
రాయచోటికి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్‌ను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ ప్రాజెక్టుల సాధన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీలో కోఆర్డినేటర్‌గా సోమవారం నియమించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాయలసీమ సాగునీటి హక్కులు, పెండింగ్ ప్రాజెక్టుల సాధన, ప్రాంత అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తానని విజయభాస్కర్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్