అన్నమయ్య జిల్లాలో విజిబుల్ పోలీసింగ్

473చూసినవారు
అన్నమయ్య జిల్లాలో విజిబుల్ పోలీసింగ్
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమం పటిష్టంగా అమలు చేశారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, గంజాయి వంటి అక్రమ రవాణాను అరికట్టేందుకు శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై జరిమానాలు విధించారు. సైబర్ నేరాలపై జాగ్రత్తలు, మహిళల రక్షణ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్