లక్కిరెడ్డిపల్లెలో శనివారం జరిగిన వైఎస్సార్సీపీ బీఎల్‌ఏల శిక్షణ సమావేశంలో, హిందూపురం పరిశీలకుడు రమేష్ కుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. అర్హులైన వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగిపోకుండా బీఎల్‌ఏలు అప్రమత్తంగా పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీ అనుబంధ సంఘాలతో సమన్వయం చేసుకుని ప్రతి అర్హుడి ఓటును రక్షించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.