రెండేళ్ల కూటమి పాలనపై రాయచోటిలో YSRCP జనగర్జన

352చూసినవారు
కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఎన్నికల హామీలు అమలు చేయలేదని నిరసిస్తూ రాయచోటిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, పార్టీ శ్రేణులు వేలాదిగా పాల్గొన్నారు. "సూపర్ సిక్స్. వెన్నుపోటు ఫిక్స్" అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ వైఖరిని నిరసించారు. ఎన్నికల హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్