తంబళ్లపల్లె - Thamballapalle

పెద్ద తిప్ప సముద్రంలోని శివాలయంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు

పెద్ద తిప్ప సముద్రంలోని శివాలయంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు

మండల కేంద్రమైన పెద్ద తిప్ససముద్రంలో వెలసిన శ్రీ ప్రసన్న పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఆలయ సేవకులు సనగరం పట్టాభి రామయ్య ఆధ్వర్యంలో శ్రావణమాసం పూజా కార్యక్రమంలో భాగంగా అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శివలింగమునకు పంచామృతాభిషేకం, ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. వేద పండితులచే శివలింగమునకు ప్రత్యేక అలంకరణతో సప్త హారతి, పంచ హారతి, నక్షత్రహారతి మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాములు వారి ఆశీర్వాదాలు పొందారు.

వీడియోలు


జగిత్యాల జిల్లా