అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్ద తిప్పసముద్రం మండలం పిడుంవారిపల్లికి చెందిన ఆకులమ్మ–నాగరాజ దంపతుల గొర్రెల మందపై శనివారం అర్థరాత్రి ఊర కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో మొత్తం 110 గొర్రెల్లో 96 గొర్రెలు గొంతులు కొరికి చనిపోయాయి. గొర్రెలే జీవనాధారంగా జీవిస్తున్న రైతు కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. ఈ ఘటనలో సుమారు రూ. 2 లక్షలకుపైగా ఆస్తి నష్టం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.