కదిరినాయునికోట వద్ద ప్రమాదం – వృద్ధురాలు గాయాలు

539చూసినవారు
బుధవారం సత్యసాయి జిల్లా గుంజోరుపల్లెకు చెందిన తిమ్మక్క(65) ములకలచెరువు మండలం కదిరినాయునికోటలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన బంధువుల అంత్యక్రియలకు హాజరుకావడానికి వెళ్తుండగా, బస్టాప్ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో స్కూటర్ ఢీకొట్టింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ నరసింహుడు వివరాలు అందించారు.