గురువారం, బి. కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్‌లో ఒక యువతి ప్రకృతి అందాలను వీక్షిస్తుండగా కిందపడి తీవ్రంగా గాయపడింది. మదనపల్లి పట్టణానికి చెందిన పల్లవి, జనవరి 1న స్నేహితులతో కలిసి హార్సిలీ హిల్స్‌కు వెళ్ళింది. గాలిబండ సమీపంలో బండపై ఉన్న గుంటి పైకి ఎక్కినప్పుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే మదనపల్లి ఆసుపత్రికి తరలించారు.