బి. కొత్తకోట: మామిడి లారీలు ఢీ.. డ్రైవర్‌కు గాయాలు

4021చూసినవారు
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి. కొత్తకోట మండలం కునీతోపు సమీపంలో మంగళవారం రాత్రి రెండు మామిడికాయల లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్