బి. కొత్తకోటలో రోడ్డు ప్రమాదం విద్యార్థికి తీవ్ర గాయాలు

1590చూసినవారు
బి. కొత్తకోటలో రోడ్డు ప్రమాదం విద్యార్థికి తీవ్ర గాయాలు
శుక్రవారం, బి. కొత్తకోట మండలం బడికాయలపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న హారిక (7) అనే చిన్నారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి కాలి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఆమెను స్థానిక ప్రభుత్వ CHC ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి చికిత్స కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్