కురబలకోటలో ఇటుక బట్టీ కార్మికుడిపై కొడవలితో దాడి

523చూసినవారు
కురబలకోట మండలంలో ఇటుక బట్టీలు వేస్తున్న కార్మికుడిపై ప్రత్యర్థి కొడవలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం జరిగిన ఈ ఘటనలో, మదనపల్లి మండలం వలసపల్లి గంగాపురానికి చెందిన శ్రీనివాసులు (40) తెట్టు గ్రామంలో ఇటుక బట్టీలు వేస్తుండగా, మండేవారిపల్లికి చెందిన హరి అక్కడికి వచ్చి బట్టీలు వేయరాదని గొడవపడ్డాడు. మాటామాటా పెరిగి హరి కొడవలితో శ్రీనివాసులుపై దాడి చేసి నరికాడు. ఈ దాడిలో శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్