అన్నమయ్య జిల్లాలో సీఎం నారా చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. 'ఇడ్లీ, వడ, సాంబార్' ఫేస్‌బుక్ ఖాతా ద్వారా సీఎం ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్టు చేశారని ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై
టీడీపీ యూత్ అధ్యక్షుడు చాకన రాజా ఫిర్యాదుతో 2024 నవంబర్‌లో కేసు నమోదైంది. కొత్తకోటకు చెందిన హనుమంత్‌రెడ్డి పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, సజ్జల భార్గవ్‌రెడ్డిని సోమవారం మదనపల్లె డీఎస్పీ పావని ప్రశ్నించనున్నట్లు సమాచారం.