తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం మట్లివారిపల్లిలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు తంబళ్లపల్లె నియోజకవర్గ
టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జి. శంకర్ యాదవ్ శనివారం ప్రారంభోత్సవం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించేందుకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, NDA కూటమి ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.