ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో జులై 2న ముఖ్యమంత్రి సభ జరగనుంది. ఈ సభకు భారీగా ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేయనున్నట్లు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.