డ్రోన్ కెమెరా ‘కన్ను’… పేకాటరాయుళ్ల ఆట కట్!

241చూసినవారు
శుక్రవారం, ముదివేడు మండలం అంగళ్లు సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజీ వద్ద పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు డ్రోన్ సాంకేతికతతో మెరుపు దాడి చేశారు. డ్రోన్ నిఘాతో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 10,500 నగదు, ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెల్‌ఫోన్లు, పేక ముక్కల సెట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ముదివేడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు మదనపల్లి రూరల్ ఇన్‌స్పెక్టర్ రవినాయక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్