
సిరి'లో కీలక మార్పులకు యాపిల్ ChatGPT తరహా యాప్
యాపిల్ తన పర్సనల్ అసిస్టెంట్ 'సిరి'కి భారీ అప్‌గ్రేడ్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇందుకోసం 'వెరిటాస్' అనే కోడ్ నేమ్‌తో చాట్‌జీపీటీ తరహా యాప్‌ను రూపొందించి, అంతర్గతంగా ఇంజినీర్లు టెస్ట్ చేస్తున్నారు. లిన్‌వుడ్ ఎల్ఎల్ఎమ్ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ యాప్ ద్వారా నెక్ట్స్-జెన్ సిరి ఏఐ ఫీచర్లను మెరుగుపరుస్తున్నారు. 2026 మార్చిలో కొత్త సిరి విడుదల చేయాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది.




