చిన్నేరు ప్రాజెక్టులో పెరిగిన ప్రవాహం, వాహనాల రాకపోకలు నిలిపివేత

3చూసినవారు
తంబళ్లపల్లె మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా చెన్నప్పగారిపల్లె వద్దగల చిన్నేరు ప్రాజెక్టులో నీటి ప్రవాహ తీవ్రత పెరిగింది. వేపలపల్లె, పాపిరెడ్డిగారిపల్లె వంతెనల వద్ద నీటి ప్రవాహం ఉద్ధృతంగా మారడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కూలీలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటి ప్రవాహం తగ్గేంతవరకు వాహనాలకు ప్రవేశం లేదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్