కొత్తకోట సీఐగా కళా వెంకటరమణ బాధ్యతలు స్వీకరణ

0చూసినవారు
కొత్తకోట సీఐగా కళా వెంకటరమణ బాధ్యతలు స్వీకరణ
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి. కొత్తకోట మండల సర్కిల్ ఇన్స్పెక్టర్గా కళా వెంకటరమణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన గోపాల్ రెడ్డి మదనపల్లె టూ టౌన్ కు బదిలీ అవ్వడంతో ఆయన స్థానంలో మదనపల్లి తాలూకా స్టేషన్ సీఐగా ఉన్న కళా వెంకటరమణ ఇక్కడికి బదిలీపై వచ్చారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. బి. కొత్తకోట మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన సీఐ కళా వెంకటరమణ తెలిపారు.

సంబంధిత పోస్ట్