రైతు కమిటీ అధ్యక్షుడిగా యోగేంద్ర రెడ్డి నియామకం

అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం, బి.కొత్తకోట మండలంలోని శీలంవారిపల్లి గ్రామంలో శుక్రవారం వైఎస్ఆర్సిపి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి, రైతు కమిటీ విభాగ అధ్యక్షుడిగా యోగేంద్ర రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు, పరిశీలకులు సురేంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నియామకాలు జరిగాయి. పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పరిశీలకులు సురేంద్రనాథ్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
