అన్నమయ్య జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ముదివేడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కురబలకోట మండలం ఎలగలపల్లికి చెందిన తరుణ్ (20) వ్యవసాయ బోరు వద్దకు పాడి పశువులకు గడ్డి కోసుకురావడానికి ఆటోలో బయలుదేరాడు. ఈ క్రమంలో సర్కార్ తోపు వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తరుణ్‌ను స్థానికులు వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.