కురబలకోట: బైక్ అదుపు తప్పి అన్నదమ్ములకు గాయాలు

2చూసినవారు
కురబలకోట మండలంలో సోమవారం, రోడ్డుపై అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తంబళ్లపల్లెకు చెందిన అజయ్ కుమార్ (19), ఆది (17) అనే ఇద్దరు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. వారు సొంత పనుల నిమిత్తం బైక్‌పై మదనపల్లెకు వెళ్తుండగా ముదివేడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు స్పందించి గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్