కురబలకోట మండలం అంగళ్లలో ఆదివారం తెల్లవారుజామున బియ్యం లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెరువులో పడింది. మదనపల్లి వైపు వెళ్తున్న ఈ లారీ ప్రమాదంతో స్థానికంగా కలకలం రేగింది. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ముదివేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల నుంచి వెల్లడి కావాల్సి ఉంది.