తల్లి బిడ్డలపై దాడి చేసి గాయపరిచిన సంఘటన సోమవారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు మండెం వారి పల్లెకు చెందిన శివ (47) ట్రాక్టర్ తో పొలం పని చేసుకుని అదే గ్రామానికి చెందిన నరసింహులు, శంకర ఇంటి ముందుగా వెళ్లాడని దాడి చేసి కొట్టారు. తల్లి ఈశ్వరమ్మ వెళ్లి అడ్డు కోగా ఆమెను కూడా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ బాధితులను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.