కురబలకోట: బాకీ సొమ్ము అడిగిన మహిళపై దాడి

692చూసినవారు
కురబలకోట: బాకీ సొమ్ము అడిగిన మహిళపై దాడి
శనివారం కురబలకోటలో, అంగళ్ళకు చెందిన పాపులమ్మ (55) అనే మహిళ తన బాకీ డబ్బు రూ. 5 వేలు అడిగినందుకు అదే వీధికి చెందిన శాంతకుమారి, ఆమె కుటుంబ సభ్యులు నలుగురు కలిసి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం రూ. 15 వేలు అప్పుగా ఇచ్చిన పాపులమ్మకు, రూ. 10 వేలు తిరిగి చెల్లించిన శాంతకుమారి, మిగిలిన మొత్తాన్ని ఇవ్వకుండా వేధింపులకు గురిచేసింది. బాకీ అడగడంతోనే ఈ దాడి జరిగినట్లు బాధితురాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్