పరిసరాల పరిశుభ్రతపై మలేరియా అధికారి సూచనలు

1209చూసినవారు
పరిసరాల పరిశుభ్రతపై మలేరియా అధికారి సూచనలు
తంబళ్లపల్లె మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసులు, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి బుధవారం ములకలచెరువులో రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీటిని పరిశీలించారు. ఇళ్ళలోని మురికి నీటిని రోడ్లపైకి వదలవద్దని, దోమల వ్యాప్తిని అరికట్టడానికి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి జాహ్నవి, హెల్త్ అసిస్టెంట్ ఖాదర్ భాష, సూపర్వైజర్ వసంతమ్మ, ఏఎన్ఎం లలిత, ఆశా వర్కర్ లక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్