కూలీ ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి – విషాద ఘటన

1264చూసినవారు
అన్నమయ్య జిల్లాలో బుధవారం ఉదయం మట్టి ఎత్తేందుకు వెళ్లిన కూలీ ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం ప్రకారం, మదనపల్లి పట్టణానికి చెందిన రెడ్డిశేఖర్ (40) ముదివేడు వద్ద కూలీ పనుల నిమిత్తం ట్రాక్టర్‌లో మట్టి తరలించే పనికి వెళ్ళాడు. ఈ క్రమంలో మట్టి తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్