కురబలకోట ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జూలై 6న

2646చూసినవారు
కురబలకోట ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జూలై 6న
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట ఎంపీడీవో కార్యాలయంలో జూలై 6న మండల సర్వసభ్య సమావేశం జరగనుంది. ఎంపీడీవో గంగయ్య యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, ఇంచార్జి ఎంపీపీ భూదేవి అధ్యక్షతన సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు అన్ని శాఖల మండల స్థాయి అధికారులు హాజరుకావాలని సూచించారు. మండల ప్రగతి నివేదికలను మూడు రోజుల ముందుగానే ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్