సోమవారం సాయంత్రం తంబళ్లపల్లి నియోజకవర్గంలోని మల్లయ్యకొండను పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, రాజంపేట పార్లమెంట్
టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు సందర్శించారు. మల్లయ్యకొండలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి లేదని, ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రచారాలను నమ్మవద్దని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మల్లయ్యకొండను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.