తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్యకొండలో మైనింగ్ జరుగుతోందంటూ
వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎమ్మెల్యేలు కిషోర్ కుమార్ రెడ్డి, షాజహాన్ బాషా, సుగవాసి ప్రసాద్ బాబు సోమవారం ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం మానుకోవాలని
వైసీపీ నేతలకు సూచించారు. ఈ మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు ఆర్. జే. వెంకటేష్, పర్వీన్ తాజ్, కొండ్రెడ్డి, పఠాన్ ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.