ములకలచెరువు కల్తీ మద్యం కేసు – ఎక్సైజ్ కస్టడీ ముగింపు

186చూసినవారు
ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ విచారణ శుక్రవారంతో ముగిసింది. ఈ కేసులో నిందితులైన ఏ5 రాజేశ్‌, ఏ19 అన్‌బురాజ్‌లను రెండు రోజుల పాటు ఎక్సైజ్ పోలీసులు కస్టడీలో ఉంచుకుని మదనపల్లిలో విచారించారు. నిందితులను గురువారం తంబళ్లపల్లి కోర్టు ఎక్సైజ్ కస్టడీకి అనుమతించింది. విచారణ పూర్తయ్యాక వారిని తిరిగి తంబళ్లపల్లి కోర్టు జడ్జి ఎదుట హాజరుపరచగా, ఇద్దరికీ కంటిన్యూ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వారిని మదనపల్లి సబ్‌జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్